EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 19వ పవిత్రోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

ఈతరం భారతం ఖమ్మం ఆగస్ట్ 14 శుక్రవారం :

ఖమ్మం పట్టణంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 19వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఉత్సవాల కరపత్రాన్ని దేవస్థానం చైర్మన్, పాలకవర్గ సభ్యులు, ఆలయ అధికారులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. జరిగే పూజా కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక సేవలు మరియు ఇతర వైదిక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్ణయించారు.

16-08-2026 ఆదివారం నుండి 19-08-2026 బుధవారం వరకు ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 19వ తేదీన ఆలయ శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.పవిత్రోత్సవాల సందర్భంగా ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి స్తంభాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

“స్వామివారి పవిత్రోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలి” అని ఆలయ ఛైర్మన్, పాలకవర్గ సభ్యులు మరియు దేవస్థాన అధికారులు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top