ఈతరంభారతం ఖమ్మం జూలై 17 : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో తాత్కాలిక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సైకియాట్రిస్ట్ పోస్ట్ మరియు సపోర్ట్ ఇంజనీర్స్ పోస్ట్ ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సెలక్షన్ లిస్టులు జిల్లా వెబ్సైటు https://khammam.telangana.gov.in లో పెట్టడం జరిగింది. కావున అభ్యర్థులు సెలక్షన్ లిస్టులోఏమైనా అభ్యంతరాలు వుంటే, అభ్యర్ధులు తేది : 18.07.2025 ఉదయం 10.30 గం.ల నుండి తేది : 20.07.2025, సా. 5 గం. వరకు, అప్లికేషన్ తో పాటు సంబందిత డాక్యుమెంట్ ప్రూఫ్ లు జతపరచి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, ఖమ్మం, లో సమర్పించగలరని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి తెలిపారు.















