ఈ తరం భారతం మహబూబాబాద్ ఆగస్టు 1 : గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా రెండో మహాసభ కరపత్రాలను గూడూరు సొసైటీ చైర్మన్ చల్ల లింగారెడ్డి మాజీ ఎంపీపీ నునావత్ రమేష్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి లతో జర్నలిస్టులతో కలిసి శుక్రవారం గూడూరులో ఆవిష్కరించారు. ట్రైబల్ జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అభివృద్ధిని ప్రజలకు వివరించే విధంగా తమ కథనాలు ఉండాలని అన్నారు. అనంతరం ఆగస్టు 8న మహబూబాబాద్ లో జరిగే మహాసభకు రావాలని మంత్రి సీతక్కను కోరిన ట్రైబల్ వర్కింగ్ జనరల్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ ఆహ్వాన కమిటీ కన్వీనర్ బానోత్ లక్ష్మణ్ నాయక్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ ముక్తవరం సత్యనారాయణ మండల అధ్యక్షులు గుర్రం ఏకాంబరం టిడబ్ల్యూజేఏ రాష్ట్ర కమిటీ సభ్యులు మంగీలాల్ నాయక్ జిల్లా నాయకులు లింగాల కిరణ్, భూక్య మోహన్ ఐజేయు గూడూరు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.














