EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మేడ్చల్ జిల్లాలో దేశ విభజన గాయాల స్మారక దినం

మేడ్చల్ ఆగష్టు 14 (ఈ తరంభారతం );రాష్ట్ర బాజపా ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలో నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి చౌరస్తా ఆవరణలో.. అఖండ భారత్ సంకల్ప దివస్ జిల్లా అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కన్వినర్ గాలి సంపత్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గాలి సంపత్ యాదవ్ మాట్లాడుతూఅఖండ భారత్ సంకల్ప దివస్ ఆగస్టు14 సందర్భంగా దేశ విభజన సమయంలో నెలకొన్న భయానక పరిస్థితుల్లో ప్రాణ త్యాగాలు చేసిన వారికి నివాళులు అర్పించాలని నాటి విషాద పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడిన వారి ధైర్య సాహసాలకు శతకోటి వందనాలు అంటూ.. ఈరోజును భారతదేశపు యొక్క ఏకత్వం, సాంస్కృతిక, సమగ్రత, చారిత్రక, వారసత్వంను గుర్తు చేసుకునే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు,ముక్యంగా..చరిత్ర గుండెల్లో మరుపురాని మారణహోమం..మతం నీడలో విడిపోయిన సౌభ్రాతృత్వం..లక్షల మంది ప్రాణాలను హరించిన దుర్దినం..అఖండ భారతం ముక్కలైన చీకటి దినం..భరతమాత హృదయాంతరాల్లో మానని శాశ్వత గాయం..భారత ఉపఖండ విభజన (1947) సమయంలో జరిగిన విపరీతమైన హింస, జాతిపరమైన హింసాచారాలు, సామూహిక వలసలు, మరియు మానవీయ నష్టాలను గుర్తుచేసుకోవడం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోటి మందికిపైగా తమ గృహాలను విడిచిపెట్టి వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు.2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దినోత్సవాన్ని ప్రకటించారు, దీని ముఖ్య ఉద్దేశం: దేశ విభజన వల్ల ఎదురైన బాధలను జ్ఞాపకం చేసుకోవడం, సమాజంలో శాంతి, ఏకతా, సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త తరాలకి చరిత్రని తెలియజేయడంవిభజన వల్ల జరిగిన దుర్ఘటనల్ని మరిచిపోకుండా ఉండటం.. పాఠశాలలు, కళాశాలలు, మ్యూజియమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు విభజనపై ఆధారపడి చిత్ర ప్రదర్శనలు, డాక్యుమెంటరీలు బాధితుల జ్ఞాపకార్థం ప్రార్థనలు, చరిత్రపై అవగాహన పెంచే కార్యక్రమాలు చెయ్యాల్సిన అవసరం ఉంది,విభజన సమయంలో అసువులు బాసిన స్వాతంత్రోద్యమ వీరులందరికీమా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ,జిల్లా నాయకులు హైమా రెడ్డి , బోడ శ్రీనివాసరావు , మాజీ కౌన్సిలర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్చురాలు బుద్దవరం లక్ష్మి వేణుగోపాల్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్, గోంగళ్ళ మహేష్, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, నాగారం మున్సిపల్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్, దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షుడు తోట నరేష్ పటేల్, ఘట్కేసర్ మండల అధ్యక్షులు బసవరాజ్ గౌడ్, పోచారం మున్సిపల్ అధ్యక్షులు సురేష్ నాయక్, పిర్జాదిగూడ మున్సిపల్ అధ్యక్షులు రాంపల్లి యాదగిరి గౌడ్, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జెల్లీ శైలజ , ఫిర్జాది గూడా మాజీ అధ్యక్షులు అనిల్ , ఘట్కేసర్ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ రావు ,, విజయవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగం అర్జున్, మహేందర్ , వెంకట చారి , మరియు జిల్లా మున్సిపాలిటీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నల్ల బ్యాడ్జిలతో మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top