ఈతరం భారతం ములుగు జనవరి 18
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది.రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఆమోదంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.














