ఈతరం భారతం నల్లగొండ జూలై 24 : జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి… అని జిల్లా ఎస్పీ శరత్ ద్ర పవర్ తెలిపారుచెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు…వాహనాలు వేగ పరిమితితో నడపాలి… అతివేగం గా నడిపేటప్పుడు స్కిడ్ అయ్యి కింద పడే అవకాశాలు ఉంటాయి…కరెంటు స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్, ముట్టుకోవద్దు…ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లకండి…అత్యవసర సమయాలలో తప్ప బయటికి రాకూడదు…జిల్లా పోలీసు శాఖ 24*7 ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది…అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయండి… అని వివరించారు.















