ఈతరం భారతం నిర్మల్, నవంబర్ 11:
______________________________
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
కరువు కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు రూ.1,000 చొప్పున 36 నెలలకు మొత్తం రూ.36 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ గడ్డం విషయంలో చూపుతున్న శ్రద్ధ రైతుల సమస్యలపై సీఎం చూపడం లేదంటూ విమర్శించారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు కావాలని కోరుతున్న బీజేపీ నాయకులు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి కేసీఆర్‌ను తిరిగి గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.















