ఈతరం భారతం బాసర నవంబర్ 11 :
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపంలో గల శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ ము కోటి పార్థివశివలింగ శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగమందిర మాసోత్సవం సందర్భంగా 22 న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరియు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. ముందుగా దీపారాధన, కలశ స్థాపన ,విఘ్నెశ్వర పూజ ,కోటి పార్థివ లింగ , శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకం పుష్పార్చన , బిల్వార్చన , గోపూజ ,గణపతి, నవగ్రహ, రుద్రహోమములు, భూదాన సంకల్ప పూజ, మహా అన్నదానము నిర్వహించ నున్నారు .సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ నాచారం వాస్తవ్యులు లహరి శ్రీ నృత్య నికేతన్ డాన్స్ అకాడమి వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యగురువులు డా. పి ఝాన్సీ రామ్ ( 30 మంది నాట్య కళాకారుల చే )వారి శిష్య బృందం చే నృత్య నీరాజనం నిర్వహించనునట్లు మరియు నాట్యగురువులు డాక్టర్ పి .ఝాన్సీరామ్ కు ఉత్తమ సాంస్కృతిక నాట్య సేవా పురస్కారం ఇవ్వనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఆశ్రమ ద్వాదశ జ్యోతిర్లింగ లింగస్థాపకులు, భూదాతలు , ధూప దీప నైవేద్య కమిటీ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు శివశ్రీ నిర్మల అంబికానాథ శర్మ సంధ్య దంపతులు కోరారు















