EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టిఎల్ఎం ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్ 

నిజామాబాద్ ఆగస్టు 21 (ఈతరం భారతం);ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఎంతో మేలు చేసే (టిఎల్ఎం)టీచింగ్ అండ్ లర్నింగ్ మెటీరియల్స్ ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్ గురువారం ప్రారంబించారు.అన్నీ స్థాయిల్లో కూడా విద్యార్థులకు అర్థమయ్యేవిదంగా ఎంతో స్ఫూర్తిగా ప్రదర్శనలున్నాయని, అందుకు అందరూ ఉపాధ్యాయులను అభినందించారు.విద్యాశాఖ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ నందు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉన్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్ట్ వారిగా, గణితం, భాష, విజ్ఞాన శాస్త్రం బోధన చేయడానికి వివిధ సృజనాత్మక పద్ధతిలోఈ ప్రదర్శన కార్యక్రమం మండల విద్యాధికారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఇందులో ఉపాధ్యాయిని సుజాత ఈ ప్రదర్శనలో గణిత శాస్త్ర అధ్యయనంలో విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిగా విషయం పట్ల శ్రద్ధ వహిo చే తీరు బాగుంది.అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుబ్బ ఉపాధ్యాయులు సంతోషి, మరియు లావణ్య కలిసి తమ సబ్జెక్ట్ లు చాలా చక్కగా సృజనాత్మకంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ RVN గౌడ్.. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. శ్రీనివాస్ గార్ల పర్యవేక్షణలో మండలంలోనీ వివిధ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయ,ఎంఆర్పి లు వీటికి న్యాయనిర్ణేతలుగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top