EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

24 గంటల్లోనే బంగారు చైన్ చోరీ కేసు ఛేదింపు

ఈతరం భారతం షాద్నగర్ రంగారెడ్డి జిల్లా నవంబర్ 14:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీ కేసును షాద్‌నగర్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.అటెన్షన్ డైవర్షన్ పద్ధతిలో రెండున్నర తులాల బంగారు గొలుసును చోరీ చేసిన మహిళను సీసీ కెమెరాలు,సాంకేతిక ఆధారాలతో గుర్తించి పట్టుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ సీతారాం మీడియా సమావేశంలో వెల్లడించారు.షాద్‌నగర్ చౌరస్తాలోని శ్రీకృష్ణ జ్యువెలరీస్‌లో గురువారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. షాపు యజమాని కోత్ర రఘువీర్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, నిందితురాలు రాజమణి (40–45), భర్త నరసింహులు,మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్కొంపల్లి గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.ఆమె జ్యువెలరీ షాపులో అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడి షోకేస్‌లో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించి వెళ్లిపోయింది.

నిందితురాలి చోరీ పద్ధతి…

ముందుగా వెంకట్రాం జ్యువెలరీ షాపుకు వెళ్లి అక్కడ అటెన్షన్ డైవర్షన్ ద్వారా చోరీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది.అనంతరం శ్రీకృష్ణ జ్యువెలరీస్‌కు చేరుకుని చెవి కమ్మలు చూపించమని అడుగుతూ సిబ్బంది దృష్టిని మరల్చి షోకేస్‌లో ఉన్న బంగారు గొలుసును చాకచక్యంగా దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

24 గంటల్లోనే కేసు ఛేదింపు..

బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజ్ సహకారంతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. పక్కా ఆధారాలతో నిందితురాలిని గుర్తించి కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు.ఈ ఆపరేషన్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ శిరీష రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సాగింది.డీఎస్ఐ శివారెడ్డి,జోనల్ టీమ్ సభ్యులు హరి, జాకీర్,మహేష్,అశోక్ రెడ్డి, సంతోష్,మోహన్ చాకచక్యంగా వ్యవహరించి నిందితురాలిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి..

ఈ సందర్భంగా పోలీసులు షాద్‌నగర్ పట్టణ ప్రజలకు, వ్యాపార సంస్థల యజమానులకు కీలక సూచనలు చేశారు.ప్రతి ఒక్కరూ తమ షాపుల్లో,ఇళ్ల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి నేరాలను త్వరగా గుర్తించి,నిందితులను పట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top