ఈతరం భారతం సిద్దిపేట ఆగస్టు 28 శుక్రవారం :
రాఖీపౌర్ణమి పండుగను పురస్కరించుకుని కొమురవెళ్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో జ్యోగిని శ్యామల స్వామివారికి, అమ్మవార్లకు మూడు బంగారు రాఖీలు కట్టింది.సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో జ్యోగిని శ్యామల శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామి వారికి అమ్మవార్లకు మూడు బంగారు రాఖిలు కట్టారు. ఈ సందర్బంగా జోగిని శ్యామల మాట్లాడుతూ… కొమురవెల్లి మల్లన్న తనకు రక్షనగా భావించి తాను చిన్నప్పటి నుంచి స్వామికి రాఖీ కట్టుతున్నట్లు తెలిపారు.తాను ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమిరోజున శ్రీ మల్లికార్జునస్వామికి రాఖీ సమర్పించడం చాలా సంతోషంగా ఉందని జోగిని శ్యామల తెలిపారు. చాలా ఏళ్ళుగా కొమురవెళ్లి శ్రీ మల్లికార్జునస్వామికి ఆనవాయితీగా రాఖీ కట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే స్వామివారికి రాఖీ కట్టిన సంవత్సరం మొత్తము తనకు మల్లన్న స్వామి రక్షగా ఉంటాడన్న నమ్మకంగా బావిస్తానని తెలిపారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిని కాకుండా మన నాగరికతకు అద్దం పట్టే విధంగా రాఖీ పండుగ రోజు ప్రతి ఒక్కరు అక్కచెల్లేలతో రాఖీ విదిగా కట్టించుకోవాలని వారికి రక్షగా నిలవాలని ఆమె తెలిపారు.















