ఈతరం భారతం యాదాద్రి భువనగిరి : ఆగస్ట్ 28 శుక్రవారం
జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలలోని గ్రామాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగి ప్రశాంతంగా ముగిశాయి. చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా రాఖీలను ధరించి సంప్రదాయపర్వపు ప్రాధాన్యతను చాటి చెప్పారు. చిన్నారుల రాఖీ వేడుకలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరగడంతో పాటు పలుచోట్ల బోనాల సమర్పణ కూడా జరిగింది. వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో సామూహిక రక్షాబంధన వేడుకలను నిర్వహించారు.















