EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంతర్రాష్ట్ర కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ కేసులో కీలక పురోగతి యూపీలోని బంగారం దుకాణం నుంచి 25 తులాల బంగారం రికవరీ

ఈతరం భారతం 09-09-2026 బుధవారం:

___________________________________

వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో 01-05-2026 రాత్రి ఓ ఇంట్లో చోరీ చేసి బంగారం మరియు నగదు అపహరించిన కేసులో అరెస్టు అయిన అంతర్రాష్ట్ర కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్ కేసులో వికారాబాద్ జిల్లా సి‌సి‌ఎస్ మరియు వికారాబాద్ టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ అంజయ్య గారి పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఇట్టి కేసులో ఇప్పటికే అరెస్టు అయి జైలు లో ఉంటున్న వికాస్ సింగ్‌ను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకుని విచారించారు.కస్టడీ విచారణలో నిందితుడు వెల్లడించిన సమాచారంతో సీసీఎస్ పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ జిల్లా కుడువర్ టౌన్‌లోని బాబా సాలిక్ రామ్ బంగారం దుకాణం నుంచి తన తల్లి లీలావతి ద్వారా గిరవు పెట్టిన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 కేసులు మరియు పరిగి పి‌ఎస్ పరిధి లోని ఒక కేసు మొత్తం 8 కేసులకు సంబంధించిన సుమారు 25 తులాల బంగారాన్ని రికవరీ చేశారు.నిందితుడి విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన బంగారాన్ని యూపీలోని కుడువర్ మరియు ఇతర ప్రాంతాల్లోని కొందరు బంగారం వ్యాపారులకు విక్రయించేవాడని తేలింది. అశోక్ కుమార్ సోనీ, వికాస్ అగ్రహారి తదితరుల బంగారం దుకాణాల నుంచి కూడా దొంగసొత్తును రికవరీ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.

రిసీవర్లపై కఠిన చర్యలు

దొంగసొత్తును కొనుగోలు చేసే రిసీవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. దొంగసొత్తును ప్రోత్సహించడం, కొనుగోలు చేయడం ద్వారా నేరాలకు సహకరించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ రికవరీలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, సిబ్బంది జయవర్ధన్, శివకుమార్, సాయప్ప, రామకృష్ణ, రాజు, శివరాజ్, వెంకటేష్, పాండురంగం పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర నిందితుడిని పట్టుకుని, కస్టడీ విచారణ ద్వారా దొంగసొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్, వికారాబాద్ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS  ప్రత్యేకంగా అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top