ఈతరం భారతం వికారాబాద్ జూన్15:
ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు తాండూరులోని బెల్కటూర్ యందుగల ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ యందు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తరచూ రక్తదానం ఇవ్వటం వలన క్యాన్సర్ ముప్పు తప్పుతుంది అని సంవత్సరంలో ఒక్కసారైనా ఇస్తే గుండెపోటు ముప్పు 88% మేర తగ్గించుకోవచ్చు అని రక్తంలో ఉండే అధిక శాతం ఇనుము వల్ల రక్తనాళాలు పూడికపోయి గుండెపోటు ముప్పు ఉంటుంది అని. రక్తదానముతో ఈ ఇనుము నిల్వలు తగ్గుతాయి అని తద్వారా కాలేయము ఆరోగ్యముగా బాగుంటుంది అని ఒక్కసారి రక్తదానం చేయడం వలన 650 కిలో క్యాలరీలు తగ్గినట్లే అని ఈ ప్రక్రియ ద్వారా శరీర బరువు అదుపులోకి వస్తుంది అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. 266 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతను అభినందించారు. ఆ రక్తాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తాండూరు లోని రక్త నిధి కేంద్రము మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వికారాబాద్ యందు గల రక్త నిధి కేంద్రము వారు పాల్గొని ఆ రక్తాన్ని సేకరించారని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి పేర్కొన్నారు.















