ఈతరం భారతం ఖాజీపేట, ఆగస్టు 17 :ఖాజీపేట మండల పరిధిలోని పెట్రోల్ బంకు వద్ద కారు- స్కూటర్ ఢీ ,కొని యువకునికి తీవ్ర గాయాలు వివరాల్లోకెళితే కాజీపేట మండల పరిధిలోని పాటి మీద పల్లె, ఎస్సీ కాలనీకి చెందిన మొయిలా కాల్వ రామయ్య, రమాదేవి, దంపతుల కుమారుడు మొయిలా కాల్వ శీను వయస్సు (23) అనే యువకుడు పెట్రోల్ బంక్ వద్ద తన ద్విచక్ర వాహనానికి (స్కూటర్) పెట్రోల్, పట్టించుకుని తిరిగి తన స్వగృహానికి , చేరుకునే క్రమంలో కడప నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన TG – 24- 0555, నెంబర్ గల కారు. ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా కడప ఆసుపత్రికి తరలించారని స్థానికుల తెలిపారు.















