యాదగిరిగుట్ట,ఆగస్టు 7 (ఈతరం భారతం);: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని… నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని స్థానిక యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎలగొండ కృష్ణ హెచ్చరించారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారి NH-163 పై వంగపల్లి నుండి ఆలేరు శివారులోని కాకతీయ కళాతోరణం వరకు రహదారిపై బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎలగొండ కృష్ణ తోపాటు రాచకొండ కమీషనరేట్ లో పనిచేస్తున్న ఈ _ చలానా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ వారి సిబ్బంది తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఏర్పాటు చేయాల్సిన బుల్లర్స్ గుర్తించి నమోదు చేశారు . గుర్తించిన ప్రమాదకర ప్రదేశాల్లో ప్రమాద నివారణ ఏర్పాట్లు చేస్తామన్నారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, మరణాలు చాలా వరకు తగ్గినాయని తెలిపినారు. NH-163 రహదారిపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లవలసి ఉండగా… వాహనదారులు అధిక వేగంతో వెళ్ళినట్లయితే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు .త్వరలో వాహనవేగాల స్పీడ్ లిమిట్ పై నిఘా ఏర్పాటు చేస్తామని,అతిక్రమించినట్లయితే జరిమానా విధిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ సేఫ్టీ వింగ్ సిబ్బంది రాకేష్ , శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.















