EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరు పోచమ్మ ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

ఈతరం భారతం ఆగస్టు 27యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో వినాయక చవితి పర్వదిన వేళ శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం వేద పండితులు ఆలేటి రంగారావు వైదిక నిర్వాహణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పూజ కార్యక్రమంలో విగ్రహ దాత పరమని స్వామి, ప్రముఖ కవి,రచయిత డా. తిరునగరి శ్రీనివాస్, బొట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్ దంపతులు, పాశికంటి శ్రీనివాస్, బండ శ్రీనివాస్ దంపతులు, నరసింహులు దంపతులు, దయ్యాల సిద్దులు, శీల వెంకటేష్, నరాల పరమేశ్వర్ దంపతులు, కుడికాల భానుచందర్, శీల కార్తీక్, సబ్బన్ సునీల్, ఆడేపు భరత్, కుడికాల రాకేష్, దీక్షిత, లహరి, శ్వేత, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. తొలి పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. భక్తులు నవరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ కోరింది.

Related News

Select the Topic
Scroll to Top