EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరు పోచమ్మ వాడలో  వైభవంగా శ్రీరామ కళ్యాణం 

ఈతరం భారతం మార్చ్ 27

యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం వద్ద శ్రీ భగత్ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం పండితులు ఆలేటి రంగన్న ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీసీతారాముల కల్యాణంలో కుడికాల భానుచందర్ – స్వప్న, సబ్బన్ నవీన్ – భాగ్యలక్ష్మి, అంకం మల్లికార్జున్ – సుధా, వర్ధమాన్ సాయికుమార్ – లక్ష్మీ ప్రసన్న దంపతులు వధూవరుల తరఫున పెద్దలుగా కూర్చుని కళ్యాణ వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ జడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్, బొట్ల విశ్వేశ్వర్, మల్ రెడ్డి నరసింహారెడ్డి, సబ్బన్ సుభాష్, పాశికంటి శ్రీనివాస్, బండ శ్రీనివాస్, దయ్యాల సిద్ధులు, గాడిపెళ్లి కృష్ణమూర్తి, నరసింహులు, శీల వెంకటేష్, చిట్టిమిల్ల సిద్ధులు, పిడిశెట్టి తిరుపతి, నమిలే శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, ఆడిపు రాములు, పేరపు శ్రీధర్, చిన్నం సిద్ధులు, బొట్ల రోహిత్, కుడికాల భాను ప్రసాద్, బండ అశ్వత్, సబ్బన్ ప్రవీణ్, సునీల్, శీల కార్తీక్, సబ్బన్ సుగంధి, పాశీకంటి రోహన్ కుమార్, కుడికాల రాకేష్, సబ్బన్ గణవర్ధన్, ఆడేపు భరత్, బండ మనోజ్, నితిన్, శీల అఖిల్, పాశీకంటి దీక్షిత, ఆడెపు సంధ్య, శ్వేత, కుడికాల నందిని, ఆడెపు శ్వేత నందిని, సబ్బన్ చిన్మయి తన్వి, దయ్యాల చైత్ర, శీల లవ, కుశల్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top