ఈతరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబరు 25 : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ చాముండేశ్వర సంతోషిమాత దేవాలయంలో ఘనంగా జరుగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరణ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ముళ్లక్కల్ రఘునాథన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భవానీమాలలో ఉన్న దీక్షాధారులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.















