ఈతరం భారతం ఆలేరు ఆగస్టు 26 : యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు జడ్పీ హైస్కూల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో ఏకో గణేశ మట్టి వినాయక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్సిసి అధికారి దూడల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక ధార్మిక కమిటీ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులు సరాబు సంతోష్ సమన్వయ సహకారంతో ఆలేరు ఎన్సీసీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. వినాయకుల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటేష్ మాట్లాడుతూ రసాయన విగ్రహాలను చెరువులు, కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాక నీరంతా కలిషితమవుతుందన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి వినాయకులు ముద్దు పిఓపి వద్దు అంటూ ఎన్సీసీ కాడేట్లు నినదించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు పోరెడ్డి రంగయ్య, పసుపులేటి నరేంద్రస్వామి, రెడ్డిపల్లి సైదులు, జ్యోతుల పరమేశ్వర్, జిట్టబోయిన సైదులు, శంకర్ రెడ్డి, మేఘరాజు, స్వర్ణలత, హేమలత, జ్ఞానప్రసూన, కవిత పాల్గొన్నారు.















