ఈతరం భారతం ఆగస్టు 23 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజక వర్గం కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి ఉపాసకులు,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి శనివారం జిల్లా కలెక్టర్ హనుమంత రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన గణపతి విగ్రహాలు పర్యావరణానికి హాని కలుగుతుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ఆదేశాను సారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను తయారుచేసి ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా కలెక్టర్ హనుమంతరావును ఆహ్వానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుకుటపు చంద్రశేఖర్, ఐ వి ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.















