EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాచారంలో ఘనంగా జరిగిన  శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణోత్సవ ముగింపు వేడుకలు

ఈతరం భారతం కాచారం ఆగస్టు 5 :యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాచారం కైలాసపుర శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయ ఆవరణలో ఆలయ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రావణ మంగళవారం శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగనవి .

పవిత్ర శ్రావణమాసం సందర్భంగా శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గత మంగళవారం జరిగిన శ్రీ లక్ష్మీ నారాయణ కల్యాణోత్సవము , మరియు బోనాల పండుగకు హాజరుకాని భక్తులు మంగళవారం జరిగిన ముగింపు వేడుక పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేడుకలకు ప్రత్యేక అతిధులుగా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ పావని దంపతులు , నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ధర్మకర్త , గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జగ్గయ్య గారి శేఖర్ గుప్తాలు హాజరైన కార్యక్రమంలో ఆలేరు పట్టణ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి సరిత దంపతులు , వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తుడు ఆలేరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రొద్దుటూరు ఉపేందర్ హేమావతి దంపతులు అమ్మవారికి ఓడి బియ్యం సారే సమర్పించారు. భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాణిజ్య కమిటీ చైర్మన్ కుక్కటపు చంద్రశేఖర్ సంధ్యారాణి దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చొని భక్తి పారవశ్యం పొందారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా నల్లవెల్లి శివాలయం చైర్మన్ ఐ వి ఎఫ్ నాయకులు తాటిపల్లి రవీందర్ పాల్గొన్న కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై న్యూయార్క్ లో ఉంటున్న మంచన నాగరాజు శర్మ సహకారంతో వారి తండ్రి కనకదుర్గ ఉపాసకులు మర్రిగూడ మండలం ఎర్రగండ్ల పల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ మంచన హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామిని పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐ వి ఎఫ్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్ , ఉప్పగల్ల నరసింహులు , బిజ్జాల శ్రీనివాస్ , ఆర్య వైశ్య నాయకులు బిజ్జాల విశ్వనాథం నాగలూరి శ్రీనివాస్ గజ్వేల్ వైశ్య సంఘం నాయకులు మల్యాల భద్రయ్య గుప్తా , గంగిశెట్టి ఉమేష్ , సిరిపురం సత్యనారాయణ , సిద్ధి రామచంద్రం గుప్తా, ఉండవల్లి నరేందర్ , తాళ్ల గూడెం మాజీ సర్పంచ్ కసాగు శ్రీనివాస్ గౌడ్ , గంగు సత్తిరెడ్డి , కాంచపర్తి అచ్యుత్ , భువనగిరి మహాలక్ష్మి కిరాణం యజమాని దేవరాజు , చిట్యాల కు చెందిన ఆదిత్య, వెంకటేశ్వర్లు, చిన్న గౌరాయపల్లి గడ్డం దుర్గాప్రసాద్, సిద్దిపేటకు చెందిన రాజరాజేశ్వర మెడికల్ షాప్ యజమాని నల్లబాల కిషన్, తుడుపునూరి రమేష్ , మురారి శెట్టి చంద్రమౌళి, శ్రీ నిర్మాత సామ శ్రీధర్ ప్రశాంతి దంపతులు, రాజా మార్కండేయ సినిమా మేనేజర్ కాసం రామగుప్త, బోనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలూరు ఉపేందర్ తదితరులు , మార్కండేయ భక్తులు రాజపేట వాస్తవ్యులు ఎక్కడ దేవి సోమరాజు పార్వతి దంపతులు రఘునాధ పురానికి చెందిన ఉపాధ్యాయుడు పాండు , రాజపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వై నరేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top