EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దేవాలయాల విశ్రాంత ఉద్యోగులకు..నగదు రహిత చికిత్సల ఆరోగ్య కార్డులు ఆరోగ్య కార్డుల జారీకి మంత్రి కొండా సురేఖ సానుకూల స్పందన

హైదరాబాదు/ యాదగిరిగుట్ట, ఆగస్టు 5: (ఈ తరం భారతం)ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా నగదు రహిత ( క్యాష్ లెస్) ఆరోగ్యకార్డులు జారీ చేయాలని చేసిన విజ్ఞప్తికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య కార్య నిర్వహక అధ్యక్షుడు ఊడెపు నరసింహారావు తెలిపారు. వేములవాడ, యాదగిరిగుట్ట ,భద్రాచలం దేవస్థానం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నేతృత్వంలో సోమవారం మంత్రిని కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య స్కీంకు నిర్ణయించిన కంట్రిబ్యూషన్ను తాము చెల్లించేందుకు గతంలోనే అంగీకారం తెలిపామని చెప్పారు . పరిమితులు లేని నగదు రహిత ఆరోగ్య చికిత్సల సౌకర్యం కల్పించడం విశ్రాంత ఉద్యోగులకు లభించిన వరంగా భావించడం జరుగుతుందని నరసింహారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ( 6 ఏ) దేవాలయాల విశ్రాంత ఉద్యోగుల సెంట్రల్ సమాఖ్యకు తాము అనుబంధంగా ఏర్పడినా మన్నారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో తనతోపాటు గౌరవ అధ్యక్షులు కే. శేషాచార్యులు, ఏ .శంకరయ్య ( వేములవాడ), భద్రాచలం నుండి వేద పండితులు, సెంట్రల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కూడా ఉన్నారని నరసింహారావు వివరించారు. త్వరలో తమకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నగదు రహిత చికిత్సల ఆరోగ్య కార్డులు అందు తాయన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top