ఈతరం భారతం ఆగస్టు 15 యాదాద్రి భువనగిరి: 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం ఘనంగా జాతీయ పతాకాల ఆవిష్కరణలు జరిగాయి. ఈసారి బాల బాలికలు ఎంతో ఉత్సాహంతో వేడుకలలో పాల్గొనడమే కాకుండా తమ ఇండ్ల పైన జాతీయ పతాకాలను పెద్దలతో కలిసి ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. వివిధ దేశ నాయకుల వేషధారణలతో కనిపించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.















