EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నృసింహుని భక్తుడను… ధర్మకర్తకు అర్హుడను  దేవస్థానం అభివృద్ధిలో ఉమ్మడి సుడుగు కుటుంబాల త్యాగ చరిత్ర మాది: జీవన్ రెడ్డి 

యాదగిరిగుట్ట, ఆగస్టు 22 (ఈతరం భారతం);: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో పంట పొలాలు, భూములు ,ఇండ్లు త్యాగం చేసిన… విరాళాలు ఇచ్చిన దాతలుగా ఉమ్మడి సుడుగు కుటుంబాల చరిత్ర తమదని సుడుగు జీవన్ రెడ్డి అన్నారు. శ్రీ స్వామివారి సేవలో తమ సుడుగు కుటుంబాలు తరతరాలుగా పునీతం అవుతున్నాయని… ధర్మకర్తగా అవకాశం ఇస్తే మరింతగా దేవస్థానం అభివృద్ధికి ,భక్తుల మౌలిక సదుపాయాల కల్పనకు ధర్మబద్ధంగా, నిస్వార్ధంగా , ఒక భక్తుడిగా అంకితభావంతో పనిచేస్తానని ఆయన అన్నారు. ఆనాడు శ్రీ స్వామివారి పూజలకు తులసివనం , పూల మొక్కలు పెంచడానికి, యాత్రికుల వసతికి కాటేజీలు నిర్మించడానికి పది ఎకరాల విలువైన భూమిని ఇచ్చామని… అదే నేడు తులసి కాటేజిగా దేవస్థానం చరిత్రలో ప్రసిద్ది చెందిందని అన్నారు. ఇటీవల దేవాలయ పునర్నిర్మాణంలో కోట్లాది రూపాయల విలువైన రెండున్నర ఎకరాల భూమిని తమ సుడుగు కుటుంబాలు ఇచ్చాయని సుడిగు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక కొండ చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్డు లో తమ సుడుగు కుటుంబాలు అత్యంత విలువైన ఇండ్లు, దుకాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం పునరావాసం కింద ప్రత్యామ్నాయ ఉపాధి నిమిత్తం ఇతరులకు ఇచ్చిన విధంగా తమ కుటుంబాలకు షాపులు ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. తమ ఇంటి పక్కనే దేవస్థానం విద్యుత్ జనరేటర్ ఉందని… నిరంతరం జనరేటర్ చప్పుడుతో తమ కుటుంబాలలో పిల్లలు సజావుగా చదువుకునే వీలు లేకుండా పోయిందని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. సంపూర్ణ భక్తి భావంతో శ్రీ స్వామివారి అంతరాలయంలో బంగారు తాపడం నిమిత్తం ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా తాను స్వయంగా సమర్పించానని తెలిపారు. ధర్మకర్తగా తనకు పని చేసే మహద్భాగ్యం కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి త్వరలో విజ్ఞప్తి చేస్తానని జీవన్ రెడ్డి దేవునికి నమస్కరిస్తూ చెప్పారు . ధర్మకర్తల మండలి ఏర్పాటు సందర్భంగా తన పేరును తప్పక పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top