యా దగిరిగుట్ట, జూలై 18 (ఈతరం భారతం) విద్యాదానం మహాదానం అన్నారు… విద్యతోనే వికాసం అని కూడా అన్నారు. అందుకే విద్యాభివృద్ధికి యాదగిరిగుట్టకు చెందిన శ్రీమతి కైరంకొండ ఉషారాణి అనిల్ కుమార్ దంపతులు శాయశక్తుల తోడ్పడుతున్నారు . ఈ విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని కైరంకొండ ఉషారాణి అనిల్ కుమార్ దంపతులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానంకు చెందిన సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఒక సెట్టు చొప్పున 75 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సంస్కృత విద్యాపీఠం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ జానకమ్మ తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషారాణి అనిల్ కుమార్ దంపతులను పలువురు అభినందించారు.















