ఈతరం భారతం అక్టోబర్ 2 :యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో దసరా సందర్భంగా గురువారం సాయంత్రం ప్రజలకు ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జమ్మి పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సంస్థ వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు, డైరెక్టర్ మహమ్మద్ కుర్షిత్డైరెక్టర్ మహమ్మద్ కుర్షిద్ పాషా, నాయకులు మంగ నరసింహులు, దూడల భాగయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.















