EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్ట్  సదానందం అనే కార్మికుడు దుర్మరణం వరుస ప్రమాదాలపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన 

యాదగిరిగుట్ట, ఆగస్టు 12 (ఈతరంభరతం);: యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు లోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతి చెందాడు. స్టీమ్ పైప్ లైన్ ఓపెన్ చేసే సమయంలో అది పగిలి కార్మికుడి తలకు బలంగా గాయం కావడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదం పట్ల ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .భువనగిరి ఏరియా ఆసుపత్రికి వెళ్లి సదానందం మృతదేహానికి నివాళులు అర్పించి …ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబాన్ని కంపెనీ అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రమాదంపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.కాలం చెల్లిన యంత్రాల స్థానంలో ప్రమాద రహితంగా ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సురక్షిత యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని , వారం రోజులపాటు యంత్రాల నాణ్యత ను,పనితీరును ,సమర్ధతను , సురక్షిత మేన అని మదింపు చేసుకోవాలని కంపెనీకి సూచించారు.. గోదావరి ఖని కి చెందిన సదానందం 25 సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి ఆలేరులో స్థిరపడి కంపెనీలో సీనియర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అందులో పని చేస్తున్న కార్మికుల తో పాటు… కార్మికుల కుటుంబాలు, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

రూ 2కోట్ల ఎక్స్ గ్రేషియా కై బిజెపి డిమాండ్

బాధిత కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తో పాటు రూ రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జిల్లా బిజెపి డిమాండ్ చేసింది. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ హుటాహుటిన కృతదేహాన్ని సందర్శించి కందుకూరు లోని కంపెనీలో ప్రమాదస్కారాన్ని పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం కార్మికుల బాధ్యతను గాలికి వదిలేసిందని ఢిల్లీ కారణంగానే నిర్లక్ష్యం కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన వెంట బిజెపి నాయకులు కాదూరి అచ్చయ్య, గుంటుపల్లి సత్యం ,కర్రె ప్రవీణ్ ,మహేష్, మందోజు నరేష్ ,గోపగాని ప్రసాద్, సురేష్ ,బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top