EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రిలో గిరిప్రదక్షిణ 

ఈ తరం భారతం ఆగస్టు 1 : యాదాద్రి భువనగిరి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం శుక్రవారం శ్రావణ మాస వేళ అత్యంత భక్తిశ్రద్ధల మధ్య గిరి ప్రదక్షిణం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉదయం ఐదున్నర గంటల నుండి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామివారి పాదాల చెంత శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వైభవాన్ని కీర్తిస్తూ శాస్త్రీయ నిత్య ప్రదర్శన జరిగింది. వేలాది మంది భక్తుల నృసింహ నామస్మరణ మధ్య గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక వైభవాన్ని తలపింపజేసింది. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top