ఈతరం భారతం ఆగస్టు 10 : యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని గ్రామాలలో ఆదివారం బోనాల పండుగ సంప్రదాయ రీతిలో ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగింది.
గ్రామాలలోని పోచమ్మ తదితర గ్రామదేవతల ఆలయాలలో మహిళలు అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయాల వద్దకు కుటుంబ సమేతంగా భారీ ఎత్తున ప్రజలు తరలి రావడంతో పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల వద్ద జాతరను తలపిస్తూ పండుగ సంబరం మిన్నంటింది.















