EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ 

ఈతరం భారతం ఆగస్ట్ 22 :యాదాద్రి భువనగిరి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజ హితాన్ని కోరి గత మూడు దశాబ్దాలుగా మట్టి వినాయక విగ్రహాలను అంజయ్య స్వామి అందజేస్తున్నారు. ఐ వి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త పర్యవేక్షణలో ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట,రఘునాథపురం ప్రాంతాలలో మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అంజయ్య స్వామి తెలిపారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు మట్టి గణపతుల ఉచిత పంపిణీ ప్రారంభం సందర్భంగా స్వంత ఖర్చుతో పర్యావరణహితం కోరి కార్యక్రమం నిర్వహిస్తున్న అంజయ్య స్వామిని అభినందించి శుభాకాంక్షల సందేశం అందించారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పసుపునూరి వీరేశం, సముద్రాల కుమార్, అయిత వెంకటేష్, సముద్రాల సత్యం, సిహెచ్ ప్రకాష్, గందె అంజయ్య, సరాబు సంతోష్,నాగపండి జగదీష్, తాటికొండ ఉపేందర్, తోట ప్రశాంత్, పొద్దుటూరు ఉపేందర్, పడిగల రాజు, గంప శ్రీమన్నారాయణ,సముద్రాల రవి, వెంకటయ్య,భోగ సంతోష్, రావుల రవీందర్ రెడ్డి, బిజ్జాల విశ్వనాథం, చొప్పదండి శ్రీధర్,బాంబే రవి, ఎర్రం భాస్కర్, పబ్బ చంద్రశేఖర్, కుక్కడం చంద్రశేఖర్, చామల కృష్ణయ్య హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top