ఈతరం భారతం ఆగస్ట్ 21 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం మల్లికార్జున ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రోప్రైటర్ సముద్రాల వివేక్ సాయి, లిఖిత నూతన దంపతులు గురువారం ప్రత్యేక అభిషేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆశీర్వచన సత్కారం ఆ దంపతులకు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. శాలువాతో సన్మానించి బాబా ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం వారి ఆధ్వర్యంలో ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెనిశెట్టి సుధాకర్, కామిటికారి అశోక్, అర్చకులు బ్రహ్మశ్రీ, వివేక్ సాయి తల్లిదండ్రులు సముద్రాల( ఐడియా) శ్రీనివాస్, ప్రభ, ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.















