ఈ తరం భారతం ఆగస్టు 9 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
సంప్రదాయ రీతిలో ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి అక్కా చెల్లెళ్లు తమ సోదరుల ఇండకు తరలివచ్చి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాలలో ప్రత్యేక పూజలు జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్ని పట్టణాలు, గ్రామాలలో రాఖీ పండుగ కోసం తరలి వచ్చిన ప్రజలతో సందడి కనిపించింది.















