ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ఆగస్టు 8 : జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత వేడుకలు ఎంతో సంప్రదాయ రీతిలో జరిగాయి.
అమ్మవారిని వేదికపై ప్రతిష్టించి అలంకరించి పూజలు నిర్వహించి మహిళలు వ్రతాలను ఆచరించారు. అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి నైవేద్య నివేదన చేశారు. పలు ఆలయాలలో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాలలో అమ్మవార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. సంప్రదాయ రీతిలో జరిగిన వరలక్ష్మి వ్రత వేడుకలతో అంతటా పండగ వాతావరణం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.















