ఈతరం భారతం ఆగస్ట్ 15 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ డా. తిరునగరి శ్రీనివాస్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్ జండావిష్కరణ జరిపారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్, పాశికంటి శ్రీనివాస్, బండ శ్రీనివాస్, దయ్యాల సిద్దులు, శీల వెంకటేష్, కుడికాల భానుచందర్, సబ్బన్ సునీల్, ఆడేపు భరత్, సబ్బన్ రమేష్, ఆడేపు బాలస్వామి, చిట్టిమిల్ల సిద్ధులు, కటకం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, స్వామి, చిప్ప ప్రభాకర్, మంత్రి భాస్కర్, మంగళంపల్లి వెంకటేష్, పర్వతాలు, జలంధర్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.















