EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడు దారుణ హత్య

వనపర్తి మే 23 (ఈతరం భారతం న్యూస్ );వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు.మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. హత్యపై హర్షవర్దన్‌ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.ఇటీవల బీఆర్‌ఎస్‌ మద్దతుదారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్దన్‌రెడ్డి చెప్పారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

.

 

Related News

Select the Topic
Scroll to Top