EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్విమ్స్ డైరెక్టర్ జగదీష్‌కు ఘనంగా అభినందనలు

ఈతరంభారతం తిరుపతి,అక్టోబర్ 21 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

_________________________________________________

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సంచాలకులు, ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గుడూరు జగదీష్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, అట్రిసోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓతో పాటు అవధూత దత్త పీఠానికి చెందిన శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. డాక్టర్ జగదీష్‌కు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్విమ్స్ డైరెక్టర్‌గా ఆయన నాయకత్వంలో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. వైద్య రంగంలో స్విమ్స్ మరింత అభివృద్ధి సాధించి, తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top