ఈ తరం భారతంహైదరాబాద్ అక్టోబర్ 21:
__________________________________
ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సీబీఐటీ (CBIT) కళాశాలలో రెండు రోజుల పాటు ఉచిత రక్త వర్గీకరణ (Blood Grouping), హిమోగ్లోబిన్ (Hemoglobin) పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరం ద్వారా సుమారు 2,000 మంది విద్యార్థులకు రక్త వర్గీకరణ, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ రక్త వర్గాన్ని తెలుసుకోవడంతో పాటు, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయుల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా అవగాహన కల్పించారు.
విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, రక్తహీనతను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల చైతన్యం కల్పించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని సొసైటీ డైరెక్టర్ జి.మాధవి తెలిపారు.
ఈ సందర్భంగా ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.సేవే లక్ష్యంగా ఆరోగ్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడమే తమ సంస్ ఉద్దేశం అని అన్నారు.















