EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

ఈ తరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 18.11.24

గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారని అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని సోమవారం తెలిపారు.వివరాల్లోకి వెళితే..గద్వాల పట్టణం వద్దేవీదికి చెందిన జయశ్రీ,నరేష్ లకు 2020లో వివాహం కాగా..2022 మొదటి కాన్పులో ఒక పాప జన్మించిందన్నారు.ఇప్పుడు రెండవ కాన్పులో ఒకేసారి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని తెలిపారు.ఇప్పుడు జన్మించిన వారిలో ఒక పాప,ఇద్దరు మగశిశివులు ఉన్నారని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటంతో.. అనంత హాస్పిటల్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని మాట్లాడుతూ.. హాస్పిటల్ లో మొదటి సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశివులు జన్మించడం..తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పుకు సంబంధించి శస్త్ర చికిత్సలో సహకరించిన డాక్టర్ వినిషారెడ్డి,డాక్టర్ బిందు సాగర్ లు కృతజ్ఞతలు తెలిఫారు

Related News

Select the Topic
Scroll to Top