EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రధానమంత్రి మోదీని అవమానించే కాంగ్రెస్ పార్టీ తీరు హేయనీయం తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్

ఇద్దరం భారతం హైద్రాబాద్ జులై 22 :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీనిఅవమానించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు హేయనీయమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్ తీవ్రంగా ఖండించారు.ప్రధానమంత్రి నివాసం ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన రాజకీయ నాటకానికి నిరసనగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడికి భారీ నిరసన ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని డాక్టర్ ప్రభా గౌడ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వకుండా అడ్డుకోవడం వెనుక వారి రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.దమ్ముంటే పార్లమెంటులో చర్చకు రావాలని ప్రభా గౌడ్ డిమాండ్ చేశారు.దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వీధి రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని ఆమె విమర్శించారు.

దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందనడానికి ఈ ఘటన మరో నిదర్శనమని డాక్టర్ ప్రభా గౌడ్ అన్నారు.ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలపై కూడా ఉందని, పార్లమెంట్‌ను సజావుగా నడవనివ్వకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.

చివరగా, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన అక్రమ అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని డాక్టర్ ప్రభా గౌడ్ డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top