కామారెడ్డి ఫిబ్రవరి 23 (ఈ తరంభారతం );ఆనాడు కేసీఆర్ చేసిన అవమానాలు అనేకం టీఆర్ఎస్ కు పోటీ చేసే ముఖం లేక బరి నుండి తప్పుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ మోసాలపైనా యుద్దం ప్రకటించినంనమ్మకద్రోహి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే టైమొచ్చిందిబీజేపీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పై యద్ద భేరీ మోగిస్తాంఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని సర్వే సంస్థలన్నీ తేల్చేశాయి గ్రాడ్యుయేట్లు, కామారెడ్డిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అర్ధరాత్రి బట్టలు మార్చుకునే టైమివ్వకుండా నన్ను అరెస్ట్ చేసి వేధించారుఅయినా బెదరకుండా పోరాడి కేసీఆర్ మెడలు వంచిన6 గ్యారంటీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ తో ప్రజలకు ఒరిగిందేమిటి?కాంగ్రెస్ మోసాలపైనా యుద్దం ప్రకటించినంనమ్మకద్రోహి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే టైమొచ్చిందిబీజేపీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పై యద్ద భేరీ మోగిస్తాంఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని సర్వే సంస్థలన్నీ తేల్చేశాయికాంగ్రెస్ లో పోటీ చేసే వాళ్లే లేక బయట నుండి వ్యక్తిని తెచ్చి బరిలో నిలబెట్టారు టీఆర్ఎస్ కు పోటీ చేసే ముఖం లేక బరి నుండి తప్పుకుందిబీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి పోరాడే కార్యకర్తల్లో మనోధైర్యం నింపండిగ్రాడ్యుయేట్లు, టీచర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తిచేశారు. పట్టభధ్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు అన్ని వర్గాల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తున్న బీజేపీకి అండగా నిలిచేందుకు మళ్లీ సమయం వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. తద్వారా పోరాడే కార్యకర్తలకు బలం చేకూర్చాలని విజ్ఝప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్, స్థానిక బీజేపీ నేతలతో కలిసి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.















