EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మా భూములే లాక్కుంటారా అంటూ కడుపుమండి తిరగబడ్డ రైతులు పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు

రాజోలి జూన్ 4 (ఈతరం భారతం);: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపుమండి రైతులు తిరగబడ్డారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను కర్రెలు చేత పట్టుకొని తరిమేశారు. అందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతులు భారీ సంఖ్యలో ఉండటంతో పోలీసులు నిలువరించలేకపోయారు. గతంలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ మరోసారి కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడంతో రైలు ఆందోళనకు దిగి వాహనాలను తగలబెట్టారు.

Related News

Select the Topic
Scroll to Top