EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చిల్పూర్ శ్రీశ్రీ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిదేవస్థానం అంగడి ఆవరణంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

ఈ తరం  భారతం  జనగామ  జూన్  15 : జనగాం జిల్లా చిల్పూర్ శ్రీశ్రీ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిదేవస్థానం అంగడి ఆవరణంలో భక్తుల సౌకర్యార్థం  వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం  భూమి పూజ  చేశారు. స్వామి వారి భక్తులైన కరీంనగర్ వాస్తవ్యులు తిరుమణి కిషన్ పటేల్ – స్రవంతి , మనోజ్ పటేల్ ,మహేష్ పటేల్ కరీంనగర్ వాస్తవ్యులు, హైదరాబాద్ కు చెందిన వంశీ రెడ్డి, దేవస్థానం డైరెక్టర్ నారాయణ రెడ్డి వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు దాతలుగా ముందుకొచ్చి పూనుకున్నారు.అదేవిధంగా శ్రీబుగులు వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి పట్టణాల నుంచి అధిక భక్తులు పాల్గొన్నారు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు , ధర్మకర్త మండలి సభ్యులు వేముల వెంకటేశ్వర్లు , గణగోని రమేశ్, ఆలయ ఈవో శ్రీమతి బి లక్ష్మీ ప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కె మోహన్ , ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ,అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం అన్న ప్రసాద దాతలు కొండ విష్ణుమూర్తి -శోభారాణి (ఆరేపల్లి గ్రామ వాస్తవ్యులు ),దేవులపల్లి వెంకటేశ్వర్లు – అనురాధ ( హైదరాబాద్ వాస్తవ్యులు) అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి ఆభరణాలను భద్రపరిచేందుకు భక్తుడు గనగాని రామచందర్ గౌడ్ ఆలయానికి బీరువాను సమర్పించారు.

Related News

Select the Topic
Scroll to Top