EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం , చిలుపూరు లో సుదర్శన హోమం, కల్యాణోత్సవం

ఈతరం భారతం జనగామ జూన్ 15 :  శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ,చిలుపూరు గుట్ట , చిలుపురు గ్రామము మరియు మండలము జనగామ జిల్లా – ఆలయము నందు మంగళవారము శ్రవణా నక్షత్రము  పురస్కరించుకొని శ్రీ స్వామివారి సుదర్శన హోమము అనంతరం మాస కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది.  వివిధ గ్రామాలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. ఇట్టి కార్యక్రమం కార్యనిర్వాహణాధికారి శ్రీమతి B. లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,మరియు జూనియర్ అసిస్టెంట్ K. మోహన్ గారు,అర్చకులు బి .రవీందర్ శర్మ , సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top