సాహిత్యాంశం
(ఈతరం భారతం)
డాక్టర్ కొండపల్లి నీహారిణి రచించిన 19 కథల సంపుటి ‘రాచిప్ప’. అనురాగం, ఆత్మీయతలను చిత్రించే కథలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. బంధుత్వాలు స్నేహాలు విజ్ఞతతోను,పట్టుదల తోను కలపబడతాయని, హక్కుగా పొందాలనుకున్నప్పుడు మాత్రం ఆ బంధాలు విధ్వంసం అవుతాయని రచయిత్రి అభిప్రాయం. ‘నిశ్శబ్దానికి ఆవల’ అన్న కథలో బంధుత్వాలను కాదనుకుని దూరమైతే ఒంటరి జీవితాలలో ఏం అనర్థాలు వస్తాయో రచయిత్రి చిత్రించి చూపారు. అరుణ అరణ్య రోదన, రాచిప్ప, అద్దంలో చందమామ, మట్టి పూలు – మంచి వాసనలు, సత్యం చర, సంసార గీతం, మృత్యుంజయుడు వంటి కథలు జీవన లోతుల్ని తడిమాయి. కథలు అంటేనే జీవితాలని చెప్పే మాటకు ఈ కథలు ఉదాహరణలుగా నిలుస్తాయి.
కొండపల్లి వేణుగోపాల్ రావు ప్రచురణలు, వెల: రూ. 125/-, పేజీలు: 152, ఫోన్: 9866360082
సమీక్షకులు : డా. తిరునగరి శ్రీనివాస్ 📱: 9441464764















