ఈతరం భారతం హైదరాబాద్ జూలై 23
రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రతకు పత్తి, మొక్కజొన్న మొక్కలు వాలిపోయాయి. ఈ వర్షంతో మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. వరిని సాగు చేసే రైతులకు వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా పోసిన నార్లు ముదిరిపోతున్నాయి. ఒక సెంటిమీటర్ వర్షపాతమే నమోదైంది. ఎక్కడ చూసిన చెరువులు, కుంటల్లో పది శాతం నీళ్లు కూడా చేరలేదు. అవి పశువులకే సరిపోతాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు డివిజన్లో గట్టిగా వర్షం కురిసిన సందర్భాలు లేవు. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయ పంటలు వైపు రైతులను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు.















