EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గురువులను సత్కరించిన బీజేపీ ఎస్‌సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్‌ కుమార్‌

గోదావరి ఖని జూలై 10 (ఈతరం భారతం):గురు పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక జీఎం కాలనీ క్రీడా మైదానంలో వివిధ క్రీడా రంగాలకు చెందిన గురువులను గురువారం ఉదయం ఘనంగా సన్మానం చేశారు.   బీజేపీ ఎస్‌సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో సేవలందిస్తున్న గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌ కుమార్‌ మాట్లాడుతూ గురువులను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కళలకు నిలయమైన కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేసి విజేతలుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అందుకు ప్రధాన కారణం ఈ ప్రాంత గురువులేనని పేర్కొన్నారు. వారి శిక్షణలో వేలాది మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్‌ సాధించారు. గోదావరిఖని ప్రాంత విజేతలు క్రీడల్లో నైపుణ్యం వల్ల పోలీస్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. ఈ విజేతలకు నిత్యం శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్న  గురువులను సన్మానించడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీ మోర్చ ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ, బీజేపీ జనగామ మండల అధ్యక్షుడు జీ భూమయ్య, సీనియర్‌ నాయకులు మహవాది రామన్న, జనహిత శ్రీను, ఈ ఉపేందర్‌, శ్రీనాథ్‌, విశ్వనాథ్‌, తడగొండ నర్సయ్య, ఎస్‌ హరీష్‌, కల్లెపల్లి శ్రీనివాస్‌, బియ్యాల మహేందర్‌, మేడగోని రవి, రాజు, చంద్రశేఖర్‌, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top