EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వానికి ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంది..  మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

ఈతరం భారతం ఖమ్మం జూలై 17 :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆడబిడ్డల చల్లనిచూపు, ఆశీర్వాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలా ప్రతి పథకం మహిళల పేరు మీదనే ఇస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డల ఆశీర్వాదం ఇస్తే ఇల్లయినా, ప్రభుత్వమైనా కలకాలం చల్లగా ఉంటుందని కామెంట్ చేశారు. అందుకే ప్రతి పథకంలో వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని వెల్లడించారు.ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.21 వేల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఇళ్లలో నిండా ధాన్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చాయని తెలిపారు. మరికొందరికి కూడా త్వరలోనే రాబోతున్నాయని వివరించారు. రేషన్ కార్డులు లేని మహిళలకు కొత్తగా ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇస్తోందని మంత్రి తుమ్మల అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top