యాదగిరిగుట్ట జూలై 19 (ఈతరం భారతం)_;: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంను తీర్చి దిద్దే క్రమంలో అధికారులు శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి శ్రీ వాణీ ట్రస్టు తరహాలో శ్రీ గరుఢ ట్రస్టు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు. రూ 5000/_వేలతో ట్రస్టు టికెట్ తీసుకునే ప్రతి భక్తునికి ఐదు అభిషేకం లడ్డూలతో పాటు ఒక కిలో పులిహోర ప్రసాదం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నుండి తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.















