EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తిరుమలలో భక్తుల పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు.

ఈతరం భారతం తిరుపతి సెప్టెంబర్ 21: రిపోర్టర్ మనోజ్ కుమార్ :

___________________________________________________

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* ఆదేశాల మేరకు చిన్నారులు, వృద్ధుల భద్రతకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

తిరుమలలోని నాలుగు మాడ వీధులు, నడక మార్గాలు, గ్యాలరీలు, బస్టాండ్, వసతి ప్రాంతాలు తదితర రద్దీ ప్రదేశాల్లో చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు మొత్తం *52,005* చైల్డ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేసి, పిల్లలు తప్పిపోయిన సందర్భంలో వారిని త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టారు.ఈ చర్యల ద్వారా తప్పిపోయిన 4 మంది బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. అదేవిధంగా తప్పిపోయిన ఒక వృద్ధ మహిళను గుర్తించి ఆమె కుమారుడికి అప్పగించారు.

పోలీస్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ సమన్వయం, సాంకేతిక సహకారంతో ఈ భద్రతా చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని, చైల్డ్ ట్యాగ్‌ను తప్పనిసరిగా వేయించాలని పోలీసులు సూచించారు. పిల్లలు లేదా వృద్ధులు తప్పిపోయినట్లయితే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

“ట్యాగ్ కట్టుకోండి – మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో పోలీసు శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top